ఎర్ర చెరువులో వలకు చిక్కిన వింత చేప..
TeluguStop.com
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం ఎర్ర చెరువులో చేపల కోసం వల వేసిన కొంతమందికి వింత చేప చిక్కింది.
ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.సాధారణంగా అక్వేరియంలో పెరిగే ఈ చేప దురదృష్టవశాత్తు చెరువుల్లో చేరింది.
సక్నోస్ క్యాట్ ఫిష్ గా పిలవబడే ఈ చేప ఇతర చేపలను భారీగా ఆహరంగా తీసుకుంటుంది.
దీని శాస్త్రీయ నామం పేటరీగోప్లిచ్థిస్ మల్టీరాడియటస్.లోరికారిడే కుటుంబానికి చెందిన ఈ చేప వాజాలు రెక్కలను పోలి బలంగా ఉంటుంది.
సాధారణంగా ఈ చేపలు మంచి నీటి వరద ప్రవాహల్లోను, బురద అడుగు భాగంలోను కఠినమైన వాతావరణాల్లో కూడా మనుగడ సాధిస్తుంది.
గరిష్టంగా 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది.ఇతర దేశాల్లో దీనిని లాంగ్ ఆర్మడ్ క్యాట్ ఫిష్ అని పిలుస్తారు.
ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో లభ్యమైన ఈ చేపను ప్రజలు వింతగా తిలకిస్తున్నారు.
ముఖ్యమంత్రి తమ్ముడి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటున్న మహిళ.. వీడియో వైరల్