ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్‌నైట్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తన్నాడు.అయితే ఆర్ఎక్స్ 100 తరహా హిట్ మాత్రం ఇప్పటివరకు కొట్టలేకపోయాడు ఈ హీరో.
కానీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని క్రేజీ ఆఫర్స్‌తో రచ్చ చేస్తున్నాడు కార్తికేయ.కాగా నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన గ్యాంగ్‌లీడర్ సినిమాలో పూర్తి్స్థాయి విలన్‌గా మారాడు కార్తికేయ.
ఆ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ అదిరిపోయే యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేశాడు.దీంతో కార్తికేయకు హీరోగా అంటే కూడా విలన్‌గా ఎక్కువ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.తాజాగా కార్తికేయకు మరో విలన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ నటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఇక హీరోగా కార్తికేయ ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.కౌశిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.హీరోగా, విలన్‌గా వరుస ఆఫర్లతో కార్తికేయ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.