ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీపై నిరసన వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్, మైనార్టీ ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆందోళనలకి విపక్షాలు వెనకుండి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు మద్దతుగా నిలబడుతున్నాయి.
ఇక విపక్షాల అండగా ఆందోళనకారులు రెచ్చిపోతూ విద్వంసం సృష్టిస్తున్నారు.ఓ విధంగా చెప్పాలంటే ఈ పౌరసత్వ వ్యతిరేకం ఆందోళనలు ఆరని జ్వాలలుగా మండుతున్నాయి.
ఇదే సమయంలో జార్ఖండ్ లో ఎన్నికలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారాయి.ఒక వేళ ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినట్లయితే తాము ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకి ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవచ్చు.
ఒక ఓడిపోతే ప్రజా వ్యతిరేకతకి అదొక నిదర్శనంగా మారుతుంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికలకి సంబందించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఈ పౌరసత్వ బిల్లు మరోసారి అధికారంలోకి రావడానికి ఆటంకంగా మారినట్లు కనిపిస్తుంది.జార్ఖండ్ లో ఐదు దశల అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారంతో ముగిశాయి.
ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలని మీడియా సంస్థలు, కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి.ఈ ఫలితాల్లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్-జేఎంఎం 38-50 స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
అయితే బీజేపీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ మాత్రం మరోసారి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.