విక్రమ్ సూపర్ హిట్.. కమల్ స్పెషల్ వీడియో రిలీజ్..!

కమల్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన విక్రం సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సూపర్ హిట్ అయ్యింది.తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

 Kamal Hassan Special Video To Telugu Audiance For Vikram Grand Success Kamal Has-TeluguStop.com

వీకెండ్ లోనే లాభాల బాట పట్టిన విక్రం సినిమా రిజల్ట్ పై కమల్ హాసన్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.ఈ క్రమంలో తన సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ వీడియో చేశారు కమల్ హాసన్.

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేశారని.సినిమాని ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్ అన్నారు కమల్ హాసన్.

అంతేకాదు సినిమాలో తనతో పాటుగా పనిచేసిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఇంకా మిగతా వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా వచ్చిందని.డైరక్టర్ లోకేష్ ప్రతిభ ఈ సినిమాతో మరోసారి వెళ్లడైందని అన్నారు.

సినిమాని తనని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికి రుణపడి ఉంటానని అన్నారు కమల్ హాసన్.రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో కమల్ హాసన్ సొంత బ్యానర్ లో విక్రం సినిమా నిర్మించారు.

విక్రం సినిమాని తెలుగులో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube