కడప ఎంపీ అవినాశ్ రెడ్డి రెండో రోజు సీబీఐ విచారణకు హాజరు అయ్యారు.నిన్న దాదాపు ఎనిమిది గంటలకు పైగా అధికారులు అవినాశ్ రెడ్డిని విచారించారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విచారిస్తోంది.
కాగా ముగ్గురుని వేరువేరుగా అధికారులు విచారించారు.కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.
మరోవైపు వివేకా హత్య కేసుతో సంబంధం లేదంటున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో ఇవాళ వారి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.