కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) అనే పేరుకి ఒక ఇమేజ్ ఉంది.సత్యనారాయణ అంటే విలనిజానికి పెట్టింది పేరు.
కెరియర్ మొదట్లో చాలా సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించాడు.ఆ తరువాత దాదాపు 100 కి పైగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఆయన కొద్దిరోజుల కిందట చనిపోయిన విషయం మనకు తెలిసిందే… అయితే సినిమాల్లో అద్భుతమైన నటుడిగా లెజండరీ ఆర్టిస్ట్ గా చాలామంది గొప్ప వాళ్ళ చేత ప్రశంషలు అందుకున్నారు.
ఆయన అప్పట్లోనే సినిమాల మీద వచ్చే డబ్బుతో చాలా వరకు ల్యాండ్స్ కొన్నారు అని ఇప్పుడు వాటి విలువ కోట్లల్లో ఉంటుంది అని తెలుస్తుంది… ప్రస్తుతం ఆయనకి హైదరాబాద్( Hyderabad ) లోనే చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది…
అలాగే లక్సరీ కార్లు కూడా ఉన్నాయి మొత్తానికి సత్యనారాయణ గారు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక చాలా ఆస్తులనే సంపాదించినట్టు తెలుస్తుంది.అయితే ఆయన తర్వాత ఆయన కొడుకులు ఎవరు కూడా ఇండస్ట్రీ కి రాలేదు…ఇక ఇది ఇలా ఉంటే సత్యనారాయణ గారు ఇండస్ట్రీలో అందరు హీరోలతో కలిసి మెలిసి ఉండేవారు ఈయన కెరీయర్ లో రెగ్యులర్ గా చేసే పాత్రలతో పాటు డిఫెరెంట్ గా ఉండే దుర్యోధనుడు, యముడు లాంటి పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇక ఇండస్ట్రీ లో యముడి పాత్ర చేయాలి అంటే అది ఒక్క సత్యనారాయణ గారి వల్లే అయ్యేది, ఆయన భారీ శరీరానికి యముడు అంటే ఇలానే ఉంటాడు అని ఆందరు అనుకునేలా ఉండేవాడు… అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి,ఈయనకి మధ్య మంచి స్నేహబంధం ఉండేది,అలాగే చిరంజీవి ( Chiranjeevi )తో కూడా మంచి బాండింగ్ ఉండేది…నిజంగా ఆయన లేని లోటు ఇండస్ట్రీ లో ఏ నటుడు తీర్చలేనిది…
.