సోషల్ మీడియా అనేది నేడు ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఇక్కడ అప్లోడ్ అవుతున్న వీడియోలలో ఏదన్నా వింతగా అనిపిస్తే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది.
తాజాగా ఓ మనిషికి ఎలుగు బంటి ఎదురుపడిన వీడియో ఒకటి అదేవిధంగా వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని డేవిడ్ ఆప్పిన్హీమర్( David Oppenheimer ) అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఓ పెద్ద కుర్చీ వేసుకుని హాయిగా రిలాక్స్ అవుతుంటాడు.
ఇంతలో అనూహ్యంగా ఓ ఎలుగుబంటి అతనికి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది.ఆ ఎలుగుబంటిని చూసి డేవిడ్ భయంతో షాక్ అవుతాడు.
సరిగ్గా అదే సమయంలో ఆ ఎలుగుబంటి( bear ) కూడా అతడ్ని చూసి షాక్ అవ్వడం మనకు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.కొన్ని క్షణాల పాటు ఇద్దరూ అలా ఒకరినొకరు భయంతోనే చూసుకుంటారు పాపం.ఆ తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించవచ్చు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటీజన్లు దీనిపైన రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నల్ల ఎలుగుబంట్లు( Black bears ) చాలా అరుదుగా దాడి చేస్తుంటాయని కొందరు అంటుంటే, మరికొంతమంది దాడిచేయడానికి నల్ల ఎలుగుబంటి అయితే ఏంటి, తెల్ల ఎలుగుబంటి అయితే ఏంటి? దానికి మూడ్ లేదు.వాడ్ని కరవలేదు… అంతే, అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొంతమంది అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా భయపడ్డారు? ఎలుగు బంటా లేక ఆ వ్యక్తా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇకపోతే తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందంటూ మరో యూజర్ తెలిపాడు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి మీమీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.