నిన్న ఉదయ్ కిరణ్ పుట్టినరోజు( Uday Kiran Birthday ) అనే సంగతి తెలిసిందే.ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ తొలినాళ్లలో సాధించిన విజయాల గురించి చర్చ జరగడంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చిరంజీవి కూతురు సుస్మిత, ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగి వేర్వేరు కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్( Journalist Bharadwaj ) సుస్మిత, ఉదయ్ ఎంగేజ్మెంట్ బ్రేక్ కావడం గురించి సుస్మిత( Sushmita Konidela ) ఉదయ్ కిరణ్ గురించి చేసిన కామెంట్ల గురించి భరద్వాజ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
తర్వాత రోజుల్లో ఉదయ్ కిరణ్ కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సైతం భరద్వాజ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.ఉదయ్ కిరణ్ మరణం ఎంతోమంది అభిమానులను ఇప్పటికీ బాధ పెడుతోంది.
ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ ప్రాణాలు కోల్పోవడంపై భరద్వాజ్ స్పందిస్తూ ఒకానొక సమయంలో ఉదయ్ కిరణ్ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అని అనిపించిందని తెలిపారు.నువ్వు నేను సినిమాను తరుణ్ మిస్ చేసుకుంటే ఉదయ్ చేతికి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
రెండో సినిమాతో ఉదయ్ కు స్టార్ ఇమేజ్ వచ్చిందని భరద్వాజ్ అన్నారు.చిరంజీవి( Chiranjeevi ) కూతుళ్లు ఇష్టమైన హీరో ఎవరని అడగగా ఉదయ్ కిరణ్ పేరు కూడా చెప్పారని సుస్మిత చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
ఇంద్ర మూవీ శత దినోత్సవ వేడుకలకు ఉదయ్ హాజరు కావడానికి కారణం పెళ్లి ఫిక్స్ కావడమే అని భరద్వాజ్ అన్నారు.మనసంతా నువ్వే కథలో కొన్ని పొరపాట్లు ఉన్నా ఉదయ్ వల్లే హిట్టైందని ఆయన తెలిపారు.ఎంగేజ్మెంట్ బ్రేక్ కావడానికి ముందు జర్నలిస్టులకు ఉదయ్ పార్టీ ఇచ్చాడని విరాళాలు ప్రకటించాడని భరద్వాజ్ వెల్లడించారు.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఉదయ్ కిరణ్ ను మెగా ఫ్యామిలీ తొక్కేసిందని ప్రచారం జరిగిందని భరద్వాజ్ వెల్లడించడం గమనార్హం.చిరంజీవి సినిమాలు చూస్తూ ఉదయ్ పెరిగాడని చిరంజీవి ఉదయ్ ఆరాధ్య నటుడని ఆయన కామెంట్లు చేశారు.ఉదయ్ కిరణ్ సక్సెస్ ను తీసుకున్న విధంగా ఫెయిల్యూర్ ను తీసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారని భరద్వాజ్ అన్నారు.ఒక మహిళా జర్నలిస్ట్ తో ఉదయ్ ప్రేమ వల్లే నిశ్చితార్థం ఆగిపోయిందని ప్రచారం జరిగిందని ఆయన అన్నారు.