నిశ్చితార్థం తర్వాత మొదటిసారి సెట్ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈయన ఈ రెండు సినిమా షూటింగ్లను కూడా పెళ్లికి ముందే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో శర వేగంగా ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు.

 Varun Tej Entered The Set For The First Time ,sakthi Prathap Singh, Varun Tej,-TeluguStop.com

ఇకపోతే జూన్ 9వ తేదీ నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం తర్వాత మొదటిసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు.ఈయన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ( Praveen Satthar ) దర్శకత్వంలో గాండీవధారి అర్జున ( Gandeevadhari Arjuna ) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయిందని సమాచారం.ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం VT 13 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ( Sakthi Prathap Singh )దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నారు.

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్నారు.ఇలా నిశ్చితార్థం తర్వాత ఈయన మొదటిసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని కూడా పెళ్లికిలోపే పూర్తి చేయాలన్న ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube