రిలయెన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రారంభించింది.దీంతో డిస్నీ+ హాట్‌స్టార్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఈ నయా రీఛార్జ్ ప్లాన్స్ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.ఇప్పటికే ఈ రీఛార్జ్ ప్లాన్స్‌ను యాక్టివేట్ చేసుకున్నవారు కూడా ఈ అదనపు బెనిఫిట్స్‌ను పొందవచ్చు.జియో రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 3 జీబీ డేటా పరిమిత వాయిస్ కాల్స్, డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు డిస్నీ హాట్‌స్టార్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లా¯Œ వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది.జియో తన రూ.2,599 ప్లాన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.దీంతో ప్రతిరోజూ 2 జీబీ డేటా అంటే 740 జీబీ మొత్తంగా లభిస్తుంది.రూ.666 జియో రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
దీంతో 2 జీబీ డేటా, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో 56 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది.జియోలో మరో బంపర్ ఆఫర్ రూ.888 ప్లాన్.దీంతో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.ఈ ప్లాన్ 3 నెలలకు వర్తిస్తుంది.
దీంతోపాటు ఏడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్రిప్షన్ పూర్తిగా ఉచితం.ప్రతిరోజూ డేటా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతూ వస్తుంది.
అందుకే డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్, దీంతో ప్రతిరోజూ 1.5 జీబీ డేట 56 రోజులపాటు వర్తిస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్ రూ.499 ప్లాన్ వివరాలు.

పైన చెప్పిన అన్నీ ప్లాన్‌లలో డిస్నీ హాట్‌స్టార్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.కేవలం రూ.549 ప్లాన్‌కు తప్ప.ఈ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నయా రీఛార్›్జ ప్లాన్స్ రేపటి నుంచి (సెప్టెంబర్ 1) అందుబాటులో ఉండనున్నాయి.రూ.499 కేవలం మొబైల్ బేసిక్ ప్లాన్, ఏడాదిపాటు వర్తిస్తుంది.అదేవిధంగా ఒకే డివైజ్‌కు యాక్సెస్ లభిస్తుంది.స్టెరియో ఆడియో క్వాలిటీ 720 పీ వీడియో వ్వాలిటీ ఉంటుంది.ఈ కొత్త ప్లాన్స్ కేవలం మొబైల్ కంటెంట్‌కే వర్తిస్తుంది.కానీ, వెబ్, లివింగ్ రూం డివైజ్‌లతో సహా అన్ని ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న ఉచిత కంటెంట్‌ను చూడటానికి మాత్రం ఈ యాప్ మిమ్మల్ని అనుమతినిస్తుంది.