టాలీవుడ్ లో ఉన్న డాన్స్ మాస్టర్స్ లో జానీ మాస్టర్( Jani Master ) కూడా ఒకరు.ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో పాటలకు కొరియోగ్రఫీ చేసి కొరియోగ్రాఫర్గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు జానీ మాస్టర్.
అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షోకి ఎన్నోసార్లు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.అలాగే బుల్లితెరపై ప్రసారమైన పలు పండుగ ఈవెంట్ లో కూడా పాల్గొని తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఎక్కువగా ఆయన షో లలో కూడా పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చేస్తూ ఉంటారు.కానీ తాజాగా మాత్రం తాను జగన్ కి వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు కానీ మాస్టర్.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వరలగా మారింది.
జగన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు కి చెందిన జానీ మాస్టర్, ప్రస్తుతం అక్కడ జనసేన ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.కాగా రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఆయనని మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని మీడియా వారు ప్రశ్నించారు.
దానికి జానీ మాస్టర్ బదులిస్తూ.నేను ఎవరికి మద్దతు ఇస్తున్నాను అనేది తరువాత తెలియజేస్తాను అని చెప్పుకొచ్చారు.

ఇంతలో మరో మీడియా పర్సన్ ప్రశ్నిస్తూ. మీరు జగన్ అభిమాని అని చెబుతున్నారు.కానీ జనసేన తరుపున తిరుగుతున్నారు ఏంటి? అని ప్రశ్నించగా జానీ మాస్టర్ స్పందిస్తూ.నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వినండి సార్.
రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం చెప్పడంతో అక్కడున్న వారందరూ ఫుల్లుగా నవ్వుకున్నారు.ఇంతలో మరొక రిపోర్టర్.
వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారా? అని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు జానీ మాస్టర్ బదులిస్తూ.ముందు ఏం జరుగుతుంది అనేది నేను తరువాత చెబుతాను అంటూ బదులిచ్చి ముగించేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.