నాగార్జున బాబాయ్ ఇచ్చిన సలహా వల్లే సక్సెస్.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )హీరోగా నటించిన తాజా చిత్రం డెవిల్( Devil ).ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

 Nandamuri Kalyan Ram Says Will Never Forget The Suggestion Given By Nagarjuna, N-TeluguStop.com

ఈ సినిమా కొందరు సూపర్ హిట్ అంటుండగా మరికొందరు పరవాలేదని అంటున్నారు.ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు హీరో కళ్యాణ్ రామ్.

అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌కి నాగార్జున( Nagarjuna ) ఇచ్చిన సలహా బాగా ఉపయోగపడిందని కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.నాగార్జున బాబాయి ఎప్పుడూ నాతో ఒక విషయం చెబుతుండేవారు.

Telugu Nagarjuna, Nandamurikalyan, Tollywood-Movie

ప్రతి హీరోలో ఆడియన్స్ కొన్ని విషయాలను ఇష్టపడతారు.అది డ్యాన్స్, కామెడీ లేదా ఏదైనా కావచ్చు.అయితే వాళ్లు కోరుకునే ఆ అంశాలు మన సినిమాల్లో ఉండేలా చూసుకోవాలి.నటుడిగా మనం డిఫరెంట్ స్టోరీలు ట్రై చేయవచ్చు.కానీ మన నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు మాత్రం ఆ సినిమాలో ఉండాలి.లేకపోతే అవి హిట్ అవ్వడం కష్టం అని నాతో అన్నారు అంటూ కళ్యామ్ రామ్ చెప్పుకొచ్చారు.

ఈ సలహాను నేను కెరీర్‌లో ఎప్పుడూ మర్చిపోలేదు అని కూడా తెలిపారు కళ్యాణ్ రామ్.

Telugu Nagarjuna, Nandamurikalyan, Tollywood-Movie

అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్స్‌పెరిమంట్ చిత్రాలను ప్రయత్నించినా ప్రేక్షకులకు నచ్చే అంశాలను మాత్రం మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని.ఒక రకంగా ఆ సలహానే నా కెరీర్‌ను మార్చింది.ముఖ్యంగా మా ఫ్యామిలీ సినిమా అంటే ఆడియన్స్ ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా ఉండాల్సిందే.

ఎంత మంచివాడవురా సినిమాలో అది లేదు కాబట్టి బాగా ఆడలేదు అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.కాగా తాజాగా సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు వస్తున్న స్పందన బట్టి చూస్తుంటే కళ్యాణ్ రామ్ కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమా పడ్డట్టే అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube