అధికారికంగా టిడిపి, జనసేన పార్టీ ( TDP Janasena party )తరఫున నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ఏపీలో ఉమ్మడి గా కార్యక్రమాలు చేపడుతూ, వైసిపి ప్రభుత్వం పోరాటం చేసే విధంగా రెండు పార్టీల మధ్య సమన్వయం కుదిరి విధంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు .వైసీపీ( Ycp ) ప్రభుత్వం పై ఉమ్మడిగా పోరాటం చేసేందుకు దీనికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించేందుకు ఈ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకోబోతుంది.
ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఈనెల 23న కీలక సమావేశాన్ని రెండు పార్టీలు నిర్వహించబోతున్నాయి.రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటుచేసిన ఈ కమిటీ తొలి సమావేశానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ,( Nara Lokesh ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈనెల 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోతోంది .
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలి, ఏ విధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలి , రెండు పార్టీల మధ్య సమన్వయం పెంచే విధంగా ఏమేం చేయాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.ఇప్పటికే టిడిపి జనసేనకు సంబంధించి సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించారు .ఇక టిడిపి విస్తృతస్థాయి సమావేశం ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది.దీనికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు,( Atchannaidu ) నారా లోకేష్ తో పాటు , పార్టీ కీలక నాయకులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్చార్జీలు పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారం పైన నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) చేపట్టనున్న ‘ నిజం గెలవాలి ‘ నినాదంతో చేపట్టనున్న యాత్ర తోపాటు , అనేక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.ఇక చంద్రబాబు( Chandrababu ) జైలు నుంచి బయటకు వచ్చేవరకు బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
.