ఇటీవల టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎస్.ఎస్.
రాజమౌళి, సి.కళ్యాణ్ తదితరులు విశాఖపట్టణంలో తెలుగు సినీ పరిశ్రమ డెవలప్మెంట్ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలోని అమరావతిలో కలిసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కి సహకరిస్తానని, అంతేగాక భూమి సంబంధిత విషయాలను కూడా తొందర్లోనే తెలియజేస్తానని మాట ఇచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలియజేశాడు.
దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా మాధ్యమాలను మెగాస్టార్ చిరంజీవి గురించి నెగిటివ్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా షూటింగులు మరియు డెవలప్మెంట్ అంటూ ముఖ్యమంత్రిని కలవడం సరికాదని అంటున్నారు.దీంతో తాజాగా జనసేన పార్టీ నేత సత్య బొలిశెట్టి ఈ విషయంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.
ఇందులో భాగంగా గతంలో కూడా అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు తదితర సీనియర్ హీరోలు స్టూడియో విషయమై పలువురు ముఖ్యమంత్రులను కలిశారని అప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.కొందరు టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి పై కుల వివక్ష చూపిస్తున్నారని అది సరికాదని తప్పుబట్టారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో చిరంజీవి మళ్లీ యధావిధిగా ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు.
అలాగే మలయాళం భాషల్లో మంచి విజయం సాధించినటువంటి లూసిఫర్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గత కొద్దికాలంగా చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడు.