కెనడా ఎన్నికల్లో భారతీయుల ప్రభంజనం.. 17 మంది ఇండో కెనడియన్ల ఘన విజయం

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.

 Jagmeet Singh, 17 Other Indo-canadians Secure Victories In Canada Elections , Ca-TeluguStop.com

కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.

ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.తాజాగా జరిగిన కెనడా ఫెడరల్ ఎన్నికల్లో 17 మంది ఇండో కెనడియన్లు విజయం సాధించారు.

వీరిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వున్నారు.వీరంతా జగ్మీత్ సింగ్ సారథ్యంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారే.

డిఫెన్స్ మినిస్టర్ హర్జిత్ సజ్జన్ వాంకోవర్ సౌత్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.కెనడియన్ సాయుధ బలగాల్లో లైంగిక వేధింపుల సంక్షోభం, ఆఫ్ఘనిస్తాన్‌లో బలగాల తరలింపుకు సంబంధించి విమర్శలు ఎదురైనప్పటికీ దాదాపు 49 శాతం ఓట్లతో హర్జిత్ తిరిగి ఎన్నికవ్వడం విశేషం.

ఇక మరో మంత్రి అనితా ఆనంద్ సైతం అంటారియోలోని ఓక్విల్లే నుంచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.యువజన శాఖ మంత్రిగా పనిచేసిన బార్డిష్ చాగర్ అంటారియోలోని వాటర్‌లూ నుంచి గెలిచారు.

ఇక ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ ఇండో కెనడియన్లలో ప్రముఖ వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.బర్నాబీ సౌత్ నుంచి ఆయన తిరిగి ఎన్నికయ్యారు.

దాదాపు 38 శాతం ఓట్లు జగ్మీత్‌కు వచ్చాయి.ఈ ఎన్నికల్లో జగ్మీత్‌ పార్టీకి 25 సీట్లు వస్తాయని అంచనా.

గ్రేటర్ టొరంటో నుంచి అనేక మంది ఎంపీలు తిరిగి ఎన్నికయ్యారు.వారిలో బ్రాంప్టన్ నుంచి మాజీ పార్లమెంటరీ సెక్రటరీ కమల్ ఖేరా, బ్రాంప్టన్ నార్త్ నుంచి రూబీ సహోటా, బ్రాంప్టన్ సౌత్ నుంచి సోనియా సిద్ధూ, హైపార్క్ నుంచి ఆరిఫ్ విరాణి గెలిచారు.

మరోవైపు కెన‌డా ప్ర‌ధాన మంత్రిగా జ‌స్టిన్ ట్రూడో ముచ్చటగా మూడోసారి ఎన్నిక‌య్యారు.ఎన్నిక‌ల ఫలితాల అనంతరం తామే గెలిచిన‌ట్లు ట్రూడో ప్రకటించారు.త్వరలోనే తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.ఓటింగ్‌లో పాల్గొని తనకు మరోసారి అధికారాన్ని అందించిన దేశ ప్రజలకు ట్రూడో ధన్యవాదాలు తెలిపారు.

లిబ‌ర‌ల్ పార్టీ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీలో నిలిచిన ట్రూడోకు క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.ప్రస్తుతం మిత్రపక్షాల మద్ధతుతో మైనార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ట్రూడో.

గ‌త ఆగ‌స్టులో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల‌కే ఆయ‌న ఎన్నిక‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే ఈసారి కూడా గెలిచినా.ట్రూడో మాత్రం భారీ మెజారిటీ సాధించాలన్న ఆశలు నెరవేరలేదు.

Telugu Indocanadians, Bardish Chagar, Canada, Harjitsajjan, Jagmeet Singh, Justi

338 సీట్లున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు 170 సీట్లు కావాలి.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.లిబ‌ర‌ల్ పార్టీ 157 సీట్ల‌లో విజ‌యం సాధించింది.ఇక క‌న్జ‌ర్వేటి పార్టీ 122 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది.అయితే కెన‌డా చరిత్ర‌లోనే ఇవి అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌లుగా విశ్లేషకులు చెబుతున్నారు.2019లో గెలిచిన సీట్ల‌తో పోలిస్తే, ఈ సారి మూడు సీట్ల‌ను లిబ‌ర‌ల్ పార్టీ కోల్పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube