ఒక వ్యక్తి తన జైలు జీవితాన్ని గడపకుండా మధ్యలోనే జైలు నుండి పారిపోయాడు.బయటకు వచ్చిన అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు.
అలా 30 ఏళ్ళు పోలీసులకు దొరకలేదు.కానీ అనూహ్యంగా 30 ఏళ్ల తర్వాత అతడు తనంతట తాను వచ్చి పోలీసులకు లొంగి పోయాడు.
కానీ అతడు అలా లొంగి పోవడానికి ఒక కారణం ఉందట.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఆస్ర్టేలియాకు చెందిన డార్కో డౌగీ డెసిక్ అనే వ్యక్తి 1992, ఆగస్టు 1న అతడి జైలు నుండి తప్పించుకున్నాడు.అతడు గంజాయి పెంచాడన్న నేరంతో జైలుకు వెళ్ళాడు.అతడికి మూడున్నర ఏళ్ల శిక్ష పడింది.13 నెలలు జైలులోనే గడిపాడు.ఆ తర్వాత జైలు నుండి తప్పించుకోవాలని అనుకుని అతడు ఉంటున్న గది నుండి సొరంగం తొవ్వుకుని జైలు నుండి తప్పించుకున్నాడు.
ఆ తర్వాత కూడా పోలీసులకు దొరకలేదు.
కానీ అతడు 30 ఏళ్ల పాటు బయట దొరకకుండా ఉన్నాడు.ఆ తర్వాత అథ్దె వచ్చి పోలీసుల ముందు లొంగి పోయాడు.
బయట నివసించడం కంటే జైలు జీవితమే బెటర్ అనే ఉద్దేశంతో అతడు మళ్ళీ పోలీసులకు లొంగి పోయాడట.
ఈ విషయం చెప్పడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు.ఆయితే అతడు లొంగి పోవడానికి కరోనా కారణమట.
ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ప్రజలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా కోల్పోయారు.
అయితే ఇతడు కూడా ఉండడానికి ఇల్లు లేక రోడ్ల మీదనే నివసిస్తూ చాలా రోజులు గడిపాడట.ఇక ఈ కష్టాలు తన వల్ల కాక బయట ఉండడం కంటే జైలు జీవితమే బెటర్ అని పోలీసులకు లొంగిపోయాడట.
అయితే ఇప్పుడు అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందట.
అయితే అతడిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.అతడు కష్టజీవి అని ఇప్పటి వరకు అతడు పక్క వాళ్లతో దురుసుగా మాట్లాడింది లేదని స్థానికులు చెబుతున్నారు.అందుకే అతడిని విడిపించి ఆదుకోవాలని నిర్ణయించుకున్నారట.
మరి చూడాలి ఇతడిని స్థానికులు రక్షిస్తారో లేదంటే జైలు జీవితం గడుపుతాడో.