వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.ప్రతి మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగుల కోసం.
షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈరోజు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద షర్మిల నిరాహారదీక్షకు కూర్చోగా పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినా కానీ ఆమె కూర్చోవడంతో మేడిపల్లి పోలీసులు షర్మిలను అరెస్టు చేయడం జరిగింది.షర్మిల దీక్షకు కూర్చునే ముందు ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ క్రమంలో పోలీసులు అనుమతి లేకపోయినా కానీ సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుందని వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రకటించడంతో.భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు దీక్షా ప్రాంగణం వద్దకు వచ్చారు.ఈ క్రమంలో దీక్షలో కూర్చున్న వైయస్ షర్మిలని పోలీసులు అరెస్టు చేసి.మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.షర్మిలను అరెస్టు చేయటంతో పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తు పోలీసులు.టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.