రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ టూర్ పై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.హస్తినాలో పెద్దలను కలిసి ఏం మాట్లాడబోతున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అధికారులు సీఎం జగన్ టూర్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారనేదనిపై క్లారిటీలేదు.
రాష్ట్రంలోని సమస్యలతో పాటు మరో ప్రధాన అంశంపై తేల్చుకునే అవకాశం ఉందని పొలిటికల్ చర్చ నడుస్తోంది.దావోస్ సదస్సులో పాల్గొని దాదాపు పదకొండు రోజుల తర్వాత తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ ప్రస్తుతం ఢిల్లీ పయనమైతున్నారు.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు.మొదటగా ప్రధానితో భేటి కానున్నారు.దావోస్ సదస్సులో జరిగిన పలు అంశాలను మోడీకి వివరించనున్నారు.ఈ మీటింగ్లో రాష్ట్ర ప్రధాన సమస్యలు మోడీకి వివరించనున్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ తీసుకుని నిధుల విషయంలో తేల్చుకోనున్నట్లు సమాచారం.పోలవరం విషయంలో క్లారిటీ జగన్ ప్రభుత్వానికి అవసరం కూడా.
అలాగే ఏపీకి రావాల్సిన నిధులు, అలాగే అప్పుల విషయంలో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో పూర్తి మద్దతు తెలిపి ఏపీకి కేంద్రం చేయుతనియ్యాలని అడిగే అవకాశం ఉంది.
ఆ తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.అలాగే ఇతర మంత్రులతో కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం.

అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ టూర్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇప్పటికే పలు కార్యక్రమాలు, పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ముందస్తుపై క్లారిటీ తీసుకుంటే రాజకీయాలు ఊపదుకోనున్నాయి.ప్రతిపక్షాలు కూడా తగ్గేదేలా అన్నట్లు ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక బాబు అయితే ఇప్పటికే పావులుకదుపుతున్నారు.ఇక జగన్ టూర్ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.