ప్రతిపక్షాలను ఉద్దేశించి మరోసారి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ( AP CM jagan )సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో జరిగిన సభలో మాట్లాడిన జగన్ ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో పాటు, జనసేనను ఉద్దేశించి విమర్శలు చేశారు.
కురుక్షేత్రం క్లాస్ వార్ అని జగన్ అన్నారు.తోడేళ్ళన్నీ ఏకమై మీ ముందుకు వస్తున్నాయని, వాటిని ఒంటరిగానే ఎదుర్కొంటామని జగన్ వ్యాఖ్యానించారు.
గతంలో చంద్రబాబు పాలను చూస్తే కుప్పంలో ప్రజలను కూడా మోసం చేశారని అర్థమవుతుందని జగన్ అన్నారు.అక్కడ పేదవాడికి ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని, రాజధాని భూముల అవినీతి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కాం వరకూ, ఫైబర్ నెట్ కుంభకోణం నుంచి మద్యం కొనుగోలు వరకు అంతా అవినీతి అని జగన్ అన్నారు .

ఒక్క సెంటు భూమి కూడా పేదలకు చంద్రబాబు ( Chandrababu )ఇవ్వలేదని కానీ ఈ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడని అన్నారు.ఇప్పటి వరకు 22 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని , చంద్రబాబు హయాంలో 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేసారని, ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో అమలు చేసిన ఘనత మన ప్రభుత్వానిదేనిని జగన్ అన్నారు.జగనన్న చేదోడు కార్యక్రమం కింద నిధులను లబ్ధిదారులకు ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 15 లక్షల మంది చిరు వ్యాపారులకు మేలు జరుగుతుందని జగన్ అన్నారు .ఇప్పటివరకు 2,906 కోట్ల రూపాయలను వారి ఖాతాలో నాలుగేళ్లలో వేసామని , గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగాయా అని జగన్ ప్రశ్నించారు. వైద్య, విద్య తమ ఇంటికి వచ్చి ఇవ్వడాన్ని ఎప్పుడైనా చూసారా అని జగన్ ( AP CM jagan )ప్రజలను ప్రశ్నించారు.

ఒక్క ప్రభుత్వం ఇలా వచ్చి లంచాలు లేకుండా పార్టీలకు కులాలకు అతీతంగా సంక్షేమ అమలు జగన్ ( AP CM jagan )ప్రశ్నించారు .52 నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయని అన్నారు. అప్పట్లో గజదొంగ రాష్ట్రాన్ని దోచుకుతుందని , దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకుంటే ఎప్పుడు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని జగన్ అన్నారు.