Manchu Lakshmi: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు.. మంచులక్ష్మి రియాక్షన్ ఇదే?

తాజాగా స్వలింగ సంపర్కులు చేసుకునే పెళ్లిళ్లకి చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు( Supreme Court ) నిరాకరించిన సంగతి తెలిసిందే.వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద లీగల్‌‌గా గుర్తింపును ఇవ్వలేమని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది.

 Manchu Lakshmi On Gay Lesbian Marriage-TeluguStop.com

సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ పరిధిలో ఉందని వెల్లడించింది.సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం నాడు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

అయితే స్వలింగ సంపర్కులకు( Gay Lesbian Marriage ) సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది.

స్వలింగ జంటలు తమ పెళ్ళిళ్ళను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయరాదని తీర్పుని ఇచ్చింది.ఈ తీర్పుపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు చాలామంది ఈ విషయంపై స్పందిస్తున్నారు.

కాగా ఈ కీలక తీర్పుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం వ్యక్తం చేయగా ఈ తీర్పు విషయంపై ఆర్ఎస్ఎస్, ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా స్వాగతించాయి.టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ( Manchu Lakshmi ) ఈ వ్యవహారం మీద తాజాగా స్పందించారు.

ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వరల్డ్ గా మారింది.స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై నేను చాలా నిరాశతో రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది అని ఆమె పేర్కొన్నారు అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం అని పేర్కొన్న ఆమె ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన స్వంత దేశంలో దీనిని తిరస్కరించారని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube