నిప్పు లేనిదే పొగ రాదంటారు.రాజకీయాలలో మాత్రం పొగ రావడానికి నిప్పు అవసరమే ఉండదు.
ఎవరికి నచ్చినట్టుగా వారు రకరకాల గాసిప్స్ ను ప్రచారంలోకి తీసుకువస్తూ ఉంటారు.అది నిజమో కాదో తెలుసుకునేందుకు మాత్రం కాస్త సమయం పడుతుంది.
ఇక విషయానికి ఏపీ సీఎం జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కు గొడవలు జరుగుతున్నాయి అని , అన్న మీద కోపంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే పోతున్నారు అంటూ రెండు మూడు రోజులుగా అదేపనిగా మీడియాలో కథనాలు ప్రచారం అవతున్నాయి .వైసీపీ గెలుపులోనూ, పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ షర్మిల జగన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి, జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన లేని లోటును తీర్చి అప్పట్లో పార్టీకి పెద్ద దిక్కుగా మారిన షర్మిలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కనీసం ప్రభుత్వంలో కానీ, పార్టీలో గానీ ఏ పదవి ఇవ్వకపోవడంతో ఆమె అలక చెందారు అనే ప్రచారాలు నడుస్తున్నాయి.
అయితే ఈ విషయాలపై అటు జగన్ వర్గం గానీ, ఇటు షర్మిల, ఆమె సన్నిహితులు కానీ ఎవరూ ఈ కథనాలపై స్పందించకపోవడంతో అందరిలోనూ అనేక అనుమానాలు నెలకొన్నాయి.ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వైసిపి సోషల్ మీడియా సైతం ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడంతో ఇంకా అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి.
కొత్త పలుకు పేరుతో ఆంధ్ర జ్యోతిలో వచ్చిన కధనం పై వివరణ ఇచ్చేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.షర్మిల తెలంగాణలో పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ప్రకటించబోతున్నారని, అప్పుడే అన్ని విషయాల పైనా క్లారిటీ వస్తుంది అంటూ సదరు ఆంధ్రజ్యోతి కథనం లో రావడం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది.