వీడియో: దురద పెట్టడంతో కారుకేసి గోక్కున్న ఏనుగు.. తర్వాత ఏమైందో చూడండి!

అడవి గుండా వెళ్లే రహదారుల్లో ప్రయాణం చాలా డేంజర్.ఎటువైపు నుంచి పులులు, సింహాలు, ఏనుగులు ఖడ్గమృగాలు వస్తాయో ఎవరూ ఊహించలేరు.

 Video: An Elephant Scratched Its Car Due To Itching See What Happened Next , It-TeluguStop.com

ఇలాంటి అడవి జంతువులు ఎదురైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సిందే.లేదా చప్పుడు చేయకుండా అలాగే ఉండి పోక తప్పదు.

అయితే ఒక్కోసారి మనం ఏమీ అనకపోయినా శాకాహార జంతువులు కూడా తమ విశ్వరూపాన్ని చూపిస్తుంటాయి.ముఖ్యంగా ఏనుగులు చేసే బీభత్సానికి వాహనదారులు బెంబేలెత్తుత్తారు.

ఇవి తమ తొండం ఒక్కసారి విసిరితే చాలు కార్లు బొమ్మల్లాగా అప్పడం అవుతాయి.

అయితే తాజాగా ఒక ఏనుగు కారుపై పడుకొని బొర్లింది.

దానికి దురద పెట్టినట్లుగా అనిపించిందో ఏమో కాబోలు.అందుకే ఆగిన కారుతో గోక్కుంటూ అది కనిపించింది.

అయితే ఆ ఏనుగు బరువుకు కారు ముందు భాగం ధ్వంసమైంది.దీనికి సంబంధించిన వీడియోని వెనుక ఉన్న ఒక వాహనదారుడు తన స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా రికార్డు చేశారు.

ఈ వీడియోని బ్యూటెంగెబిడెన్ @Buitengebieden అనే ట్విట్టర్‌ పేజీ పోస్ట్ చేస్తుంది.దీనికి ఇప్పటికే 24 లక్షల వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగు అడవి గుండా వేసిన ఒక రహదారిపైకి రావడం చూడవచ్చు.బహుశా అది దురదతో బాగా బాధ పడుతుందేమో.అందుకే అది నేరుగా ఒక కారు వద్దకు వెళ్లింది.అనంతరం తన ముందు కాలును కారు టైర్‌పై పెట్టింది.

ఆపై కారు ముందుకు వెళ్లి తన వెనుక భాగాన్ని కారు ముందున్న టాప్‌పై పెట్టి రుద్దడం మొదలుపెట్టింది.అది కారు బానెట్‌పై కూర్చోవడంతో ఆ వాహనం నుంచి పొగలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత కారుపైకి ఎక్కి, వాహనం ముందు భాగాన్ని, అలాగే సైడ్ వ్యూ మిర్రర్‌ను పగలగొట్టింది.చివరికి అది కారు దిగి వెళ్ళిపోయింది.

అప్పటికే ఆ కారు ముందు భాగం చాలా వరకు ధ్వంసమైంది.అందులో డ్రైవర్ కూడా ఉన్నాడు.

అతడు ప్రాణభయంతో బాగా భయపడిపోయాడు.ఏనుగు కాస్త ముందుకు పోగానే అతడు కారును వెంటనే వెనక్కి తిప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube