ఆ ఎంపీ టీడీపీ లోకి వస్తున్నారా ? 

ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో చెలరేగిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధం అయ్యింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.టికెట్లు దక్కని వారు ,దక్కే ఛాన్స్ లేని వారు టిడిపితో టచ్ లోకి రావడం, కొంతమంది పార్టీ కండువా కప్పుకోవడంతో, ఆ చేరికలపై టిడిపి( TDP ) ఆశలు పెట్టుకుంది.

 Is That Mp Coming To Tdp, Tdp, Ysrcp, Jagan, Ap Cm Jagan, Narasarao Peta Mp, Lav-TeluguStop.com

తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు( MP Lavu Srikrishna Devarayalu ) వైసిపికి రాజీనామా చేశారు.పార్టీలో నెలకొన్న గందరగోళం పరిస్థితుల్లో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అయితే రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారనేదానిపై ఆయన క్లారిటీ ఇవ్వనప్పటికీ ఆయన టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.దీనికి కారణం టిడిపి తో లావు కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉండడమే.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Lavusrikrishna, Sarao Peta Mp, Ysrcp-Politics

లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు పెదరత్తయ్య టిడిపికి మొదటి నుంచి అనుకూలంగానే ఉంటూ వచ్చారు.వీరికి చెందిన విజ్ఞాన్ యూనివర్సిటీ ( Vigyan University )ఏర్పాటు సమయంలోనూ అప్పటి టిడిపి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది.అయితే 2019 ఎన్నికలకు ముందు శ్రీకృష్ణదేవరాయలుని వైసిపి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించి, నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చింది.అప్పటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు, ఎమ్మెల్యేలతో విభేదాలు వంటి ఎన్నో కారణాలతో , చాలాకాలంగా ఆయన అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Lavusrikrishna, Sarao Peta Mp, Ysrcp-Politics

ఇక వచ్చే ఎన్నికల్లోను లావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు ఇవ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో, టిడిపిలో చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు డోఖా ఉండదనే లెక్కల్లో ఆయన ఉన్నారట.ఆయన టిడిపిలో కనుక చేరితే నరసరావుపేట పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు  ఈజీ అవుతుందనే లెక్కల్లో టిడిపి ఉంది.ఒకవేళ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరితే ఆయనకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేందుకూ సిద్ధమనే సంకేతాలు టిడిపి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube