హిందుత్వ ఆధారంగా రాజకీయాలు చేస్తున్న భాజపా( BJP ) దేశంలో మెజారిటీ వర్గాలను ఆకర్షించి విజయవంతంగా రెండుసార్లు ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించి మరొకసారి ప్రధాని పీఠంపై( Prime Minister Seat ) గురి పెట్టింది.తనకున్న అసంఖ్యాకమైన కార్యకర్తల బలాన్ని, అపరిమితమైన ఆర్థిక వనరులని, మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్యకర్తల అండని నిచ్చెన మెట్లుగా చేసుకుని మరొకసారి ఢిల్లీ పీఠంపై గురి పెట్టింది .
అయితే కలిసికట్టుగా భాజపాను ఎదుర్కోకపోతే మరొకసారి ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు ఈసారి గట్టిగా ఎదుర్కొనేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్( Nitish Kumar ) నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది.
ఈనెల 23వ తారీఖున పాట్నా వేదికగా జరుగుతున్న ఎన్డీఏ యేతర కూటమికి సర్వం సిద్ధమైంది .ఇప్పటికే ఈ మీటింగ్ కు హాజరవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది .శరద్ యాదవ్ కూడా హాజరవుతారని తెలుస్తుంది.

మీటింగుకు పార్టీ అధినేతలు మాత్రమే రావాలని ముందుగానే షరతు పెట్టడంతో మీటింగ్ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుని ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని ప్రతి పక్షకూటమి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.ప్రతిపక్ష కూటమి తరపున 450 సీట్లలో వన్ అండ్ వన్ వ్యూహాన్ని అమలు పరచాలని భాజపా అభ్యర్థికి పోటీగా ప్రతిపక్ష కూటమి నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండేలా చూసుకోవాలని అప్పుడు భాజాపాని ఓడించడం సులువు అవుతుందనే వ్యూహాన్ని పాటించాలని నితీష్ కుమార్ సూచించబోతున్నట్లు తెలుస్తుంది.

ముందు భాజాపాని గద్దే దించితే ప్రభుత్వ ఏర్పాటుకు, పదవుల పంపకానికి తదుపరి చర్చల్లో ఒక నిర్ణయానికి రావచ్చు అన్న ప్రతిపాదన ఆయన పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తమ రాజకీయ ఉనికే ప్రశ్నార్ధకమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఒక మెట్టు కిందకి దిగే దిశగా ముందుకు వెళ్లాలని మిగతా పక్షాలు కూడా ప్రాథమిక అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా తన ఏకపక్ష ధోరణితో ప్రతిపక్షాలను లెక్కలేనట్లుగా వ్యవహరించిన బిజెపికి ప్రతిపక్ష కూటమి ఒక గట్టి గుణ పాఠాన్నే నేర్పాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది
.