కీలకమైన ఎన్నికల సమయంలో తన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలతో( Sharmila ) జగన్ కు పెద్ద తలనొప్పే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను షర్మిల చేస్తున్న విమర్శలు వైసిపిని, తనను బాగా డామేజ్ చేస్తున్నాయని జగన్ ఆందోళన చెందుతున్నారు .
ముఖ్యంగా వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలు, క్రిస్టియన్ ఓటు బ్యాంకు కు చీలిక తెచ్చే విధంగా షర్మిల చేస్తున్న కామెంట్స్ జగన్ కు బాగా ఇబ్బంది కలిగిస్తున్నాయి.ప్రధాన ప్రతిపక్షం టిడిపి కంటే ఎక్కువగా షర్మిల చేస్తున్న కామెంట్స్ జనాల్లోకి వెళ్తూ, ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
జగన్ ( jagan )దూకుడు కి బ్రేకులు వేసే విధంగా షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో కీలకంగా పనిచేసి , ఆ పార్టీకి దూరమైన నేతలను రంగంలోకి దించి, షర్మిల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయినా షర్మిల మాత్రం తన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు.
అన్న జగన్ కు సంభందించిన అన్ని విషయాలను బయటపెడతామంటూ షర్మిల హడావుడి చేస్తున్నారు.జగన్ తో పాటు , జగన్ చుట్టూ ఉండే తమ బంధువులు, కీలక నాయకులను షర్మిల టార్గెట్ చేసుకున విమర్శలు చేస్తున్నారు.ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి .వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ లేరని, కేవలం ఆయన పేరు మాత్రమే ఉందని షర్మిల అన్నారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్( YSR ) కు కొత్త అర్ధాన్ని షర్మిల చెప్పారు.వై అంటే వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ), ఎస్ అంటే సాయిరెడ్డి , ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ సెటైర్లు వేశారు .
వీరే వైసిపిని నడిపిస్తున్నారని , ఇది జగన్ రెడ్డి పార్టీ , నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ అని షర్మిల విమర్శలు చేశారు .ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టి బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న పార్టీ అంటూ షర్మిల విమర్శలు చేశారు.రాజశేఖర్ రెడ్డి ఒక్క ఆశయన్నైనా వైసీపీ నాయకులు తీర్చారా అని షర్మిల ప్రశ్నించారు.ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ విధంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు జగన్ , వైసీపీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేస్తున్నాయి.