విశాఖపట్నం లో జరిగిన రెండవ ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు పవర్ పప్లే ఆరంభం నుండే ఢిల్లీ బ్యాట్స్ మెన్ లని కట్టడి చేసారు, ఈ దశలోనూ ఆ జట్టు భారీ స్కోర్ చేస్తుందని అనిపించలేదు.
చెన్నై బౌలర్లలో ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా, తాహిర్, హర్భజన్ లు అద్భుతంగా బౌలింగ్ చేసారు.ఢిల్లీ ఓపెనర్లు ప్రిథ్వి షా, శిఖర్ ధావన్ ఎక్కువ సేపు క్రీజు లో నిలవలేకపోయారు.
కాలిన్ మున్రో , రిషబ్ పంత్ లు రాణించిన వారికి ఇతర బ్యాట్స్ మెన్ నుండి సహకారం లభించలేదు.మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
మున్రో 27 పరుగులు చేయగా రిషబ్ పంత్ 38 పరుగులు చేసి ఆ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు.
148 పరుగుల లక్ష్య ఛేదన లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ లు అర్ద సెంచరీలు చేసి చెన్నై లక్ష్యాన్ని మరింత తేలిక చేసారు.
చెన్నై జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ లని కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.దీనితో చెన్నై జట్టు ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ లోకి వెళ్ళింది.ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో చెన్నై జట్టు తలపడనుంది.

ముంబై ఇండియన్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ రికార్డు లు ఎలా ఉన్నాయి
చెన్నై జట్టు ముంబై జట్లు ఐపీఎల్ ఫైనల్ లో ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా చెన్నై జట్టు ఒకసారి గెలవగా ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలిచింది.ఈ సీజన్ లో ముంబై తో ఆడిన 3 మ్యాచ్ లలో ఓటమి పొందినా చెన్నై జట్టు ఐపీఎల్ ఫైనల్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది…
.