భారత జట్టు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్( Shubman Gill ), భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి లకు బీసీసీఐ వార్షిక అవార్డులు వరించాయి.హైదరాబాద్ వేదికగా బీసీసీఐ ఈ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది.
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు శుభ్ మన్ గిల్ దక్కించుకుంటే.జీవితకాల సాఫల్య పురస్కారం రవిశాస్త్రికి దక్కింది.
కరోనా కారణంగా 2019 నుంచి బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగలేదు.మళ్లీ ఈ 2024 ఏడాదిలో జరగనున్న సంగతి తెలిసిందే.

భారత జట్టు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ వన్డే ల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్నాడు.2023 లో వన్డేల్లో అద్భుతమైన ఆటను ప్రదర్శించడం వల్ల గిల్ ఈ అవార్డు దక్కించుకున్నాడు.గిల్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడి 2271 పరుగులు చేశాడు.ఇందులో ఆరు సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి.గిల్ 20 టెస్టుల్లో 1040 పరుగులు చేశాడు.ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.14 టీ20ల్లో 335 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ ఉన్నాయి.

రవిశాస్త్రి 1983 లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.రెండు పర్యాయాలు భారత జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.రవి శాస్త్రి భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండే సమయంలో భారత జట్టు అద్భుతంగా రాణించింది.అందుకే భారత క్రికెట్ జట్టుకు రవిశాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డుతో రవిశాస్త్రి( Ravi Shastri )ని సత్కరించనుంది.
ఈ బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత క్రికెట్ మాజీ దిగ్గజాలు, ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా హాజరు కానున్నారని బీసీసీఐ తెలిపింది.







