భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు ఆడిన నాలుగు మ్యాచ్లలో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాయి.ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఈ జట్ల మధ్య నేడు ధర్మశాల వేదికగా ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగనుంది.
నేటి మ్యాచ్ లో విజయం సాధించి ఐదవ విజయం ఖాతాలో వేసుకోవాలని ఇరుజట్లు పోటీపడుతున్నాయి.ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏ జట్టు ఐదవ విజయం సాధిస్తుంది.ఏ జట్టు తొలి ఓటమిని రుచి చూస్తుంది అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానులలో ఉంది.

భారత్ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించి సెమీఫైనల్ దిశగా దూసుకుపోతోంది.నేటి మ్యాచ్ భారత్ కు ఒక పెద్ద సవాల్.ఎందుకంటే న్యూజిలాండ్ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే.మరొకవైపు ధర్మశాల వేదిక న్యూజిలాండ్ కు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది.ధర్మశాల వేదిక పేసర్లకు అనుకూలంగా ఉంటుంది.భారత జట్టులో కీలక పేసర్లు ఉన్న మ్యాచ్ ఆరంభం నుండి చివరి వరకు రోహిత్( Rohit ) సేన ఆచితూచి అడుగులు వేస్తేనే ఖాతాలో ఐదవ విజయం చేరుతుంది.

భారత జట్టు టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించాలి.మిడిల్ ఆర్డర్ కూడా పరవాలేదు అనిపించాలి.లోయర్ ఆర్డర్ కనీస పరుగులు చేయాలి.ఇక బుమ్రా, జడేజా, సిరాజ్, కుల్దీప్ ( Bumrah, Jadeja, Siraj, Kuldeep )తమ బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయాలి.
ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసిందే.న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే అన్ని విభాగాల్లో జట్టు చాలా పటిష్టంగా ఉంది.న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ఎక్కడ పొరపాట్లు లేకుండా ముందుకు సాగుతోంది.ధర్మశాలలో పరిస్థితులు పేసర్లకు బాగా అనుకూలంగా ఉంది.
వీరికి తోడు ఏ జట్టు స్పిన్నర్లు చెలరేగితే.ఆ జట్టు ఖాతాలో విజయం చేరుతుంది.