తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం జపాన్( Japan movie )ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.
కాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.
హీరో కార్తీకి జపాన్ 25వ చిత్రం అన్న విషయం తెలిసిందే.తన కెరీయర్‌లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ.
ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది.

కాగా నాగార్జున( Nagarjuna ) అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది.
అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై 182 కేసులు ఉన్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు.తమిళనాడు( Tamil Nadu )లోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు.
నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమా( Oopiri )లో మెప్పించారు.

ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే కార్తీ మూవీని తన బ్యానర్ లో విడుదల చేయాలని నాగార్జున నిర్ణయం తీసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అలాగే కార్తీ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







