ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మరింత రసవత్తరంగా కొనసాగుతోంది.ఐపీఎల్ లీగ్ దశ చివరాకరికి చేరుకున్నా ఇంకా ఏఏ జట్లు ప్లే ఆప్స్ కు చేరుకుంటాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.
కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని చేరుకొని ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది.నేటి వరకూ చూస్తే ప్రతి జట్టు 13 మ్యాచ్లను ఆడగా అందులో ముంబై ఇండియన్స్ తప్ప మిగతా జట్లు ఏవి ప్లే ఆప్స్ కు అర్హత సాధించలేదు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 14 పాయింట్లతో రెండు.మూడు స్థానాల్లో కొనసాగుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై భారీ విజయం సాధించి ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది.
అయితే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లలలో ఏ జట్టు నాలుగో స్థానం పొందుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ సేఫ్ పొజిషన్ లో ఉన్నా కానీ నాలుగో స్థానానికి మాత్రం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి.
ఈ పోటీ ఇప్పుడు చివరి లీగ్ మ్యాచ్ వరకు ఈ టెన్షన్ కొనసాగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంకో మ్యాచ్ మిగిలి ఉన్నా కానీ ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.
దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్యనే నాలుగో స్థానానికి పోటీ నెలకొని ఉంది.ఇందులో ఏ జట్టు అత్యధికంగా పరుగులతో గెలుస్తుందో వారికి ప్లే ఆఫ్ వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇకపోతే ప్రస్తుతం నెట్ రన్ రేట్ ప్రకారంగా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి రన్ రేట్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆప్స్ కు వెళ్లే చాన్స్ ఉంది.
అంతేకాదు ముంబై ఇండియన్స్ మ్యాచ్ తో గెలిస్తే ఏకంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంది.ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై భారీ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాదు జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.