విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా అవినీతికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే కోర్టులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఐదో నిందితుడు సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారని సమాచారం.