ఎవరు ఈ అర్జున్ దాస్ ? ఎందుకు లక్షల జీతం వదులుకొని సినిమాలు చేస్తున్నాడు?

అర్జున్ దాస్ ఈ మధ్య టాలీవుడ్ లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.కానీ ఇంతవరకు అతడు తెలుగులో నేరుగా చేసిన చిత్రం ఒకటే ఒకటి అది గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీ.

 Interesting Facts About Tamil Actor Arjun Das,arjun Das,vikram,perumaan,vijay,ta-TeluguStop.com

గంభీరమైన గొంతుతో అర్జున్ దాస్ ఈ ఒక్క ఏడాది లోనే 7 సినిమాల్లో నటించాడు.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అతడు పాపులర్ అవుతుండడం విశేషం.

అతడు తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన ఖైదీ.తర్వాత విజయ్ మాస్టర్ సినిమాలో సైతం మంచి పాత్రలో నటించాడు.

ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ రోజుల్లోనే ఇంత పాపులర్ అవడం వెనక అర్జున్ దాస్ శ్రమ ఏంటి? అతను ఎవరు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Arjun Das, Perumaan, Tamil, Vijay, Vikram-Movie

1990లో చెన్నైలో జన్మించిన అర్జున్ చిన్న తనం నుంచి చదువులో ముందుండేవాడు.అలాగే నటన అంటే కూడా మహా ఇష్టం.కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాను ముందు లైఫ్ లో సెటిల్ ఇవ్వాలని అనుకున్నాడు.

అందుకే దుబాయిలో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం సంపాదించడం మొదలుపెట్టాడు అన్ని పరిస్థితులు చక్కబెట్టాక మళ్ళీ తాను నటుడు అవ్వాలనే కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు.అందుకే ఉద్యోగం మానేసి మళ్లీ చెన్నైకి వచ్చి చేరుకున్నాడు.

అయితే చెన్నైకి వచ్చాక అతను బాగా బరువు పెరిగాడు.అయితే సినిమాల్లో నటించాలంటే ఇంత బరువు ఉండకూడదు అనుకొని ఏకంగా 32 కేజీలు తగ్గాడు.

Telugu Arjun Das, Perumaan, Tamil, Vijay, Vikram-Movie

ఇక మొట్టమొదటిగా పెరుమాన్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన కూడా అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే అనుకోకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఒక షార్ట్ ఫిలిం లో నటించాడు.ఆ షార్ట్ ఫిలిం లో నటనకు గాను అతనికి మంచి పేరుతో పాటు కార్తీతో ఖైదీ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కింది.

తొలుత విడంగా నటించడానికి ఆలోచించిన ఆ తర్వాత ఓకే అన్నాడు.ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఆ తర్వాత అర్జున్ దాస్ ఎప్పుడు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు కూడా పరిచయమయ్యాడు అర్జున్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube