తారక్ భావ... ఆ 5 సంవత్సరాలు సినిమాలు మానేసి ఎక్కడికెళ్లాడో తెలుసా?

సినిమా ఇండస్ట్రీకి ఎందరో వస్తారు… పడతారు లేస్తారు సక్సెస్ అవుతారు.కానీ వెంటనే సక్సెస్ అంటే మాత్రం ఇక్కడ సెట్ అవదు అని ఖచ్చితంగా చెప్పగలము.

 Interesting Facts About Actor Ravi Varma,actor Ravi Varma,rakhi Movie, Krishna V-TeluguStop.com

అదే విధంగా ఎందరో వివిధ వృత్తులలో ఉన్న వారు, బంగారు స్పూన్ తోనే పుట్టినవారు కూడా నటన మీద సినిమా మీద ఉన్న ఒక్క జిజ్ఞాస తో వస్తారు.అయితే రాగానే మనకు అవకాశాలు ఇవ్వడానికి ఇండస్ట్రీ మనం తాతది కాదు.

అదే విధంగా ఒక నటుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద కీలక పాత్రలు చేసే స్థాయికి ఎదిగాడు.మరి ఆ నటుడు ఎవ్వరో చూద్దామా.

ఇతని పేరు రవి వర్మ తూర్పు గోదావరిలో జన్మించి హైద్రాబాద్ లో జీవనం సాగించాడు.నటుడు అవ్వాలన్న కలతో టాలీవుడ్ బాట పట్టి ఎన్నో ప్రయత్నాల తర్వాత 2005 వ సంవత్సరంలో దేవా కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ఇందులో రాజా మరియు స్నేహాలు హీరో హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమాలో రవి వర్మ బాగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.

అప్పుడే ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ ఎన్టీఆర్ తో రాఖీ సినిమాను ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు.వెన్నెలలో రవి వర్మ నటనకు మెచ్చిన ఆయన ఈ సినిమాలో కీలక పాత్రా ఇచ్చారు.

ఇందులో ఎన్టీఆర్ చెల్లెల్ని హింసించే భర్తగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా నిలిచిపోయాడు.ఈ సినిమాతో రవి వర్మ చాలా పాపులర్ అయిపోయాడు.ఎక్కడకు వెళ్లినా ఈయనను గుర్తు పట్టని వారుండరంటే నమ్మండి.అలా తనకంటూ ఒక స్టాంప్ వేసుకున్నాడు.

అప్పటి నుండి వెనక్కు తిరిగి చేసుకునే పనిలేకుండా పోయింది.ఇప్పటి వారు రవి వర్మ తన కెరీర్ లో 40 చిత్రాలకు పైగా చేశాడు.

అయితే ఒక కొంతకాలం రవి వర్మ సినిమాలు ఆపేసి అమెరికాకు వెళ్లి వచ్చాడు.ఇందుకు సరైన కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదు.

కానీ రాఖీ సినిమా అనంతరం కొన్ని సినిమాలు చేసి అమెరికాకు వెళ్లాడని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో రవి వర్మ తెలిపాడు.అందుకే 2008 నుండి 2013 ప్రథమార్ధం వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు.

Telugu Ravi Varma, Krishna Vamshi, Rakhi, Vennela-Top Posts Featured Slide

అదే సమయంలో అమెరికాలోని రెడిఫ్ కంపెనీలో సిస్టం చైర్మన్ గా ఉన్నట్లు ఇంటర్వ్యూలో తెలిపారు రవివర్మ.ఒకవేళ ఈ సమయంలో టాలీవుడ్ లోనే ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది.కానీ కొన్ని ఆర్ధిక పరిస్థితులు కూడా ఇందుకు కారణం అయ్యాయని అప్పట్లో టాక్ విన్పించింది.కానీ రవి వర్మ చెబుతున్న ప్రకారం నటనలో ఇంకా మెళకువలు నేర్చుకోవడానికి వెళ్ళాను అంటున్నారు.

అయితే 2013 లో అమెరికా నుండి ఇండియా వచ్చేసి మళ్ళీ యధావిధిగా సినిమాలలో నిమగ్నం అయ్యారు.అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని మంచి పాత్రలు చేసి ప్రజలలో మంచి నటుడిగా గుర్తించబడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube