సినిమాలపై ఆసక్తితో గూగుల్ లో జాబ్ వదులుకున్న ఈ నటుడి గురించి తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మధునందన్ తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.హైదరాబాద్ గూగుల్ లో తాను పని చేశానని ఆయన తెలిపారు.

 Interesting Facts About Actor Madhunandan Details Here Goes Viral , Madhunandan,-TeluguStop.com

తన తల్లీదండ్రులు చదువుకోవాలని జాబ్ చేయాలని చెప్పారని చదువుకున్నానని జాబ్ చేశానని పెళ్లి కూడా అయిపోయిందని వైఫ్ నుంచి కూడా సపోర్ట్ లభించిందని ఆయన అన్నారు.

తన భార్య ఎంబీఏ చదివిందని ఆమె కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిందని పెళ్లి తర్వాత తన భార్య జాబ్ కు దూరంగా ఉందని మధునందన్ అన్నారు.

భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా నా భార్య జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని మధునందన్ చెప్పుకొచ్చారు.రెండు పడవల మీద కాలు పెట్టడం కంటే ఏదో ఒక పడవ మీద కాలు పెట్టడం మంచిదని తాను భావించానని ఆయన తెలిపారు.

రెండు పడవల మీద కూడా కాళ్లు పెట్టవచ్చని ఏదో ఒకదానిలో నిలద్రొక్కుకున్న తర్వాత అలా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇంటినుంచి కూడా పని చేయవచ్చని ఆయన కామెంట్లు చేశారు.

తాను ఉప్పల్ లో ఉంటానని ఆయన తెలిపారు. నేను, లిరిక్ రైటర్ కృష్ణచైతన్య చాలా క్లోజ్ అని ఆయన కామెంట్లు చేశారు.

చందూ మొండేటి తన్ ఫ్రెండ్ అయినా ఆయన సినిమాల్లో నటించలేదని మధునందన్ తెలిపారు.

Telugu Job Google, Madhu Nandan, Nuvvu Nenu, Number-Movie

వాళ్లు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాని పక్షంలో కొన్నిసార్లు సినిమాల్లోకి తీసుకోరని మధునందన్ అన్నారు.సుధీర్ వర్మ పాత్ర ఉంటే కచ్చితంగా ఛాన్స్ ఇస్తారని ఆయన తెలిపారు.తన తొలి సినిమా నువ్వు నేను అని స్టూడెంట్ నంబర్1, నువ్వు నేను డేట్లు క్లాష్ కావడంతో తాను స్టూడెంట్ నంబర్1 నుంచి తప్పుకున్నానని ఆయన తెలిపారు.

స్టూడెంట్ నంబర్1 సినిమాలో ఎన్టీఆర్ ఫ్రెండ్ రోల్ ను మిస్ చేసుకున్నానని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube