వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే కిరణ్ కుమార్ లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.జనసేన పార్టీ నాయకులు దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.
ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న ఘటన కారణంగా వారిపై దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ ప్రకటించింది.దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే, విశాఖలో వైసీపీ నేతలు చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం అనంతరం ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా మంత్రుల వాహనాలపై జనసేన కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఏపీలో పెను దుమారాన్ని రేపింది.