టీం ఇండియాలో ఒకప్పుడు సచిన్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రస్తుత కాలంలో కింగ్ కోహ్లీ అంటే అంత క్రేజ్ ఉంది.ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించాడు.
ఎందుకంటే ఏ రంగంలోనైనా నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.నెంబర్ వన్ స్థానానికి వెళ్లిన తర్వాత మొదటి కంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
ఈ విషయం టీం ఇండియా మాజీ కెప్టెన్,రన్ మెషిన్ కింగ్ కోహ్లీని చూస్తే నిజమే అనిపిస్తుంది.ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు మన కింగ్ ముందు తలవంచాయి.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా ఈ రోజు ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది.ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవాలంటే విరాట్ కోహ్లీ రాణించి తీరాలి.
శనివారం టీమిండియా ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా విరాట్ కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కోహ్లీ కి నెట్ బౌలర్స్‌తో బ్యాటింగ్ కోచ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.ఒక్కో బ్యాటర్‌కు కొంత సమయం ఇస్తూ పాక్టీస్ చేయిస్తున్నాడు.

ఈ క్రమంలో గంటల కొద్ది ప్రాక్టీస్ చేసిన కోహ్లీ టైమ్ అయిపోయిన విషయాన్ని కోచింగ్ స్టాఫ్ సైతం గుర్తు చేస్తూ, మరీ విరాట్ యువర్ టైమ్ ఇజ్ అప్ అంటూ నెట్స్ వదిలి వెళ్లాలి అని చెప్పారు.కానీ కింగ్ కోహ్లీ తన తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన దీపక్ హుడా ఇంకా అక్కడికి రాకపోవడంతో,అతను వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తా అతను రాగానే నేను వెళ్లిపోతానని పర్మిషన్ తీసుకుని మరీ ప్రాక్టీస్ చేశాడు.అది ఒక ఛాంపియన్ ప్లేయర్‌కు ఉండే లక్షణం అని క్రికెట్ అభిమానలు ఆ వీడియోను షేర్ చేస్తూ కోహ్లీకి సెల్యూట్ చేస్తున్నారు.







