అమెరికాలో నివస్తిస్తున్న భారతీయలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ఎలాగైనా వారిని భారత్ పంపేయాలని చేస్తున్న ప్రయత్నాలు అందరికి తెలిసినవే అయితే ట్రంప్ చేస్తున్న ఈ వికృత చేష్టలకి విసిగిపోతున్న భారతీయులు ఒక్క సారిగా ట్రంప్ నిర్ణయంతో షాక్ అయ్యారు.భారత సంతతికి చెందినా మహిళ కి ట్రంప్ అత్యంత కీలకపదవి అప్పగించారు.
దాంతో షాక్ అవ్వడం భారతీయుల వంతు అయ్యింది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో అత్యున్నతమైన ,ఎంతో కీలకమైన పదవిగా ఉన్న ఎనర్జీ విభాగంలో అణుశక్తిశాఖ విభాగానికి భారత సంతతికి చెందిన రీటా బనర్వాల్ అనే మహిలని అసిస్టెంట్ సెక్రెటరీగా స్వయంగా ట్రంప్ నియమించారు.అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్దిరోజుల్లోనే ట్రంప్ చర్యలను వేగవంతం చేశారు.అది కూడా భారత సంతతి మహిళ కి ఈ కీలక భాద్యతలు అప్పగించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.
ఇదిలాఉంటే రీటా ప్రస్తుతం బరన్వాల్ గేట్‌వేఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్‌లో డైరెక్టరుగా సేవలు పని చేస్తున్నారు అయితే ప్రస్తుత ఈ ప్రతిపాదనను సెనెట్ ఆమోదించాల్సి ఉంది.ఆ తర్వాత ఆమెకు అణుశక్తి సాకేంతికత పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ వంటి అదనపు బాధ్యతలుంటాయని అధికారులు తెలిపారు.