ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో ఇండియన్ హాకీ గోల్ కీపర్..!

టోక్యో ఒలింపిక్స్​ 2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడిన విషయం తెలిసిందే.41 ఏళ్ల తర్వాత హాకీలో మెడల్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.అయితే మన భారత జట్టులో దిగ్గజ ప్లేయర్ల వల్లే ఇది సాధ్యమైంది.ముఖ్యంగా ఇండియన్ హాకీ జట్టు గోల్​కీపర్​ పీఆర్​ శ్రీజేష్​ నెట్ ముందు కాంక్రీట్ గోడలా నిల్చుని జర్మనీ ప్లేయర్ల గోల్స్ ఆపాడు.

 Indian Hockey Goalkeeper In The Prestigious Award Race. Award Race, Indian, Goal-TeluguStop.com

దీంతో భారత హాకీ జట్టుకు విజయం సుగమం అయ్యింది.ఇండియన్ హాకీ టీం కాంస్య పతకం కైవసం చేసుకున్న సమయంలో పీఆర్​ శ్రీజేష్​ను భారత ప్రజలు పొగడ్తలతో ముంచెత్తారు.

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా అతని ప్రతిభకు మంత్ర ముగ్ధులయ్యింది.అందుకే తాజాగా అతన్ని “వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2021” అనే ఒక ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ చేసింది.

ఈ విషయం గురించి తెలుసుకున్న శ్రీజేష్​ ఆనందం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం నేషనల్ కోచింగ్ క్యాంపులో అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

పురస్కారానికి నామినేట్ అయ్యాక అతను మాట్లాడుతూ.“ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.టీమిండియా జట్టు కృషి వల్లే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మేం అందరం గుర్తింపు దక్కించుకుంటున్నాం.ఈ క్రెడిట్ అంతా హాకీ ఇండియాకే దక్కుతుంది.అర్హత గల విజేతను నిర్ణయించడం అభిమానుల చేతుల్లోనే ఉంది.” అని చెప్పుకొచ్చాడు.

ఈ పురస్కారానికి ఆన్​లైన్​ ఓటింగ్​ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.జనవరి 10 నుంచి 31 వరకు జరిగే ఈ ఓటింగ్​ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు పాల్గొంటారు.ఒకవేళ ఈ అవార్డు శ్రీజేష్​కు వరిస్తే.ఇండియా తరఫున వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న రెండో హాకీ ప్లేయర్​గా చరిత్ర సృష్టిస్తాడు.తొలిసారిగా మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్ 2019లో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌ పురస్కారం దక్కించుకుంది.2016లో అర్జున అవార్డును కూడా ఈమె అందుకుంది.ఇక శ్రీజేష్​ కొద్ది రోజుల క్రితం ఎఫ్​ఐహెచ్​ గోల్​కీపర్​ ఆఫ్​ ది ఇయర్-2021​ అవార్డు కైవసం చేసుకున్నాడు.శ్రీజేష్​ ఇప్పటిదాకా 240 ఇంటర్నేషనల్ మ్యాచులు, మూడు సార్లు ఒలింపిక్స్​లో పాల్గొని గొప్ప హాకీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube