ఈ మధ్య గల్ఫ్ కంట్రీస్ లో లాటరీల రూపంలో భారతీయులని అదృష్టం వరిస్తోంది.గల్ఫ్ కంట్రీస్ లో అధికారికంగా నిర్వచిందే లాటరీలలో ఎక్కువగా భారతీయులు గెలుపొండుతున్నారు.
గడిచిన నాలుగు నెలల కాలంలో సుమారు 5 మంది వ్యక్తులని ఈ లాటరీ వరించింది.అయితే తాజాగా మరొక భారతీయుడికి కళ్ళు చెదిరే లాటరీ వచ్చి పడింది వివరాలలోకి వెళ్తే.
యూఏఈలోని అబుదాబి లో నివాసముంటున్న ఓ భారత ఎన్నారై ని భారీ అదృష్టం వరించింది.ఒక్కసారిగా ఆ వ్యక్తి సంపన్నవంతుడిగా మారిపోయాడు.7 మిలియన్ దిర్హమ్‌ల విలువైన లాటరీ అతడి సొంతమైంది.భారత్‌కు చెందిన తొజో మాథ్యూ అనే వ్యక్తి “బిగ్ టికెట్ అబుదాబి లక్కీ లాటరీ” లో గెలుపొందాడు.
ఆయన కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ “075171” కు లాటరీ దక్కింది.దీంతో 7 మిలియన్ దిర్హమ్‌ల భారీ డబ్బు ఆయనకు దక్కింది.
అయితే ఈ మొత్తం భారత కరెన్సీ తో పోలిస్తే అక్షరాలా రూ.13 కోట్లు పైమాటే.ఈ వార్తను ‘బిగ్ టికెట్ అబుదాబి లక్కీ లాటరీ’ నిర్వాహకులు అబుదాబి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రకటించారు.మాథ్యూతో మరో 9 మంది తక్కువ విలువగల లాటరీలను గెలుచుకున్నారు.
అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ లాటరీ గెలుచుకున్న 9 మందిలో మరో ఐదుగురు భారతీయులు ఉండడం విశేషం.