అమెరికాలో మరో భారత తేజం కీలక స్థానాన్ని కైవసం చేసుకుంది.అక్కడి సుప్రీం కోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుగా పరిగణించే డిసి సర్క్యూట్ అప్పీళ్ళ కోర్టుకి న్యాయమూర్తిగా భారత సంతతి అమెరికన్ న్యాయవాది నియోమి రావు నియంపింప బడ్డారు.
గతంలో న్యాయమూర్తిగా ఉ న్న బ్రెట్ కవానా స్థానంలో నియోమి రావును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు.
ఈ మధ్య కాలంలో ట్రంప్ భారతీయ అమెరికన్ల కి కీలక పదవులని కట్టబెడుతూ ఉండటం విశేషం ఈ నెలలో సుమారు ఇద్దరు భారతీయ అమెరికన్ల కి ట్రంప్ కీలక పదవులని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా నియోమి రావునుని తాజాగా ఎంపిక చేశారు ట్రంప్.
ఈ మేరకు వైట్‌హౌస్‌లో మంగళవారం దీపావళి సంబరాల్లో పాల్గొన్న ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు.సెనెట్ ఈ నియామకాన్ని ఆమోదిస్తే ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యవహారాల కార్యాలయం (ఓఐఆర్‌ఎ) అడ్మినిస్ట్రేటర్‌గా వున్న నియోమి రావు శక్తివంతమైన కోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన రెండవ భారతీయ సంతతి వ్యక్తి కానున్నారు.
తాజా వార్తలు