భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia )మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా భారత మహిళల జట్టు వరుస రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూసి, మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే వన్డే సిరీస్ కోల్పోయింది.ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు, వన్డే మ్యాచ్లలో ఆ స్థాయిలో రాణించలేక పోయింది.
వన్డే సిరీస్ ఆశలను సజీవంగా ఉంచే కీలక మ్యాచ్లో కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది భారత జట్టు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 255 పరుగులు చేసింది.భారత జట్టు బ్యాటర్లైన శృతి మంధాన( Shruti Mandhana )(34), రీచా( Reacha ) (96) పరుగులతో రాణించారు.
జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి రీచా ఘోష్ మూడవ వికెట్ కు 88 పరుగులను జత చేసింది.ఇక భారత జట్టు లక్ష్యాన్ని చేదించి విజయం సాధిస్తుందని అనుకున్నారు.
కానీ జేమీమా అవుట్ అవ్వడం, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( Captain Harman Preet Kaur ) ఐదు పరుగులకే అవుట్ అవ్వడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.సెంచరీకి చేరువలో ఉండే రీచా ఘోష్ (96) అవుట్ అవ్వడం, దీప్తి ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయింది.మ్యాచ్ చివర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.భారత జట్టు 13 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.దీంతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే ఆస్ట్రేలియా 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.మూడో వన్డే మ్యాచ్ జనవరి 2న జరగనుంది.
కనీసం ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.