తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ సీఎంలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన ఆ ప్రాజెక్టు వలన ప్రజలకు ఏమైనా లాభం చేకూరిందా అని ప్రశ్నించారు.
కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే కాళేశ్వరంతో లాభం జరిగిందన్నారు.ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను సీఎం లాక్కుంటున్నారని ఆరోపించారు.
భూముల రికార్డులను మార్చేస్తున్నారన్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.రూ.లక్ష రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చిందన్న ఆయన పెద్ద రైతులకే రైతుబంధుతో లాభం అని తెలిపారు.