సాధారణంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు( Government Jobs ) ఊహించని స్థాయిలో పోటీ ఉంటుంది.యూపీఎస్సీ ఉద్యోగాలకు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలెంట్ ఉన్నా చాలామంది విద్యార్థులు యూపీఎస్సీ పరీక్షలో సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు.మూడుసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా స్నేహజ అనే యువతి మాత్రం కసి, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించారు.
నాలుగో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్( IFS) సాధించిన స్నేహజ 103వ ర్యాంక్ సాధించడం గమనార్హం.తన సక్సెస్ స్టోరీ గురించి స్నేహజ( IFS Snehaja ) మాట్లాడుతూ హైదరాబాద్ లోనే నేను పుట్టి పెరిగానని నాన్న వెంకటేశ్వర్ ఛార్టెడ్ అకౌంటెంట్ కాగా అమ్మ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా గవర్నమెంట్ జాబ్ చేసేవారని ఆమె చెప్పుకొచ్చారు.
నాన్న ప్రోత్సాహంతో స్కూల్ లో టాపర్ గా నిలిచానని స్కూల్ కెప్టెన్ గా ఉండేదానినని స్నేహజ అన్నారు.తల్లీదండ్రులకు నేను ఒక్కగానొక్క కూతురినని ఆమె కామెంట్లు చేశారు.

ఖైరతాబాద్ లోని నాసర్ స్కూల్ లో చదువు పూర్తైందని నాన్న ప్రభావంతో సీఏ పూర్తి చేసి విజయ ఎలక్ట్రికల్స్( Vijaya Electricals ) లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకున్నానని స్నేహజ పేర్కొన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారిగా సేవలు అందిస్తున్న స్నేహజ ఓటమి ఎదురైందని ఆగిపోవద్దని ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి అని చెబుతున్నారు.మన టాలెంట్ మనకే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలని స్నేహజ సూచిస్తున్నారు.

ఫస్ట్, సెకండ్ ప్రయత్నాలలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయానని మూడో ప్రయత్నంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ లో జాబ్ వచ్చినా జాయిన్ కాలేదని 2016 సంవత్సరంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా ప్రయాణం మొదలైందని ఆమె తెలిపారు.నా భర్త రోహిత్ ఐఐఎస్ అధికారిగా పని చేస్తున్నారని పాప పేరు సహస్ర అని ఆమె చెప్పుకొచ్చారు.స్నేహజ సక్సెస్ స్టోరీ( Snehaja Success Story ) నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.