సౌత్ లండన్( South London )కు చెందిన ఓ జంట తక్కువ ధరకు తమ ఇంట్లో గదిని అద్దెకు ఇవ్వాలనుకున్నారు.అయితే ఆ రూమ్లో రెంటుకు దిగే వ్యక్తి తమ ఇద్దరు చిన్న పిల్లలను ప్రతిరోజూ మూడు గంటల పాటు చూసుకోవాలని కూడా వారు ఒక రూల్ పెట్టారు.
అంటే వారే రెంట్ కి రూమ్ ఇస్తారు, అలానే వారే జాబ్ ఇస్తారు.కానీ శాలరీ మాత్రం ఇవ్వరు, రెంటు అద్దె మాత్రం తీసుకుంటారట.
అంటే వీరి వద్ద జాబ్ చేస్తూ వీరికే డబ్బులు ఇవ్వాలన్నమాట.ఈ వింత జాబ్ ఆఫర్ తెలుసుకొని చాలామంది షాక్ అయ్యారు.
వారు స్పేర్రూమ్( SpareRoom ) అనే వెబ్సైట్లో ఈ జాబ్ ఆఫర్ గురించి ఓ ప్రకటనను పోస్ట్ చేశారు.గదుల కోసం వెతుకుతున్న చాలా మందికి వారి ఆఫర్ నచ్చలేదు.
అద్దె చెల్లించాలని, బేబీ సిట్టర్ గా పనిచేయాలని కోరడం సరికాదని, చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఈ రూమ్ రెంట్ నెలకు £400 (రూ.35,000) మాత్రమే అని యజమానులు పేర్కొన్నారు.ఇది దక్షిణ లండన్లోని క్లాఫమ్లో చాలా చౌక ధర చెప్పుకోవచ్చు.
కానీ అక్కడ నివసించే వ్యక్తి తమ ఖాళీ సమయాన్ని వదులుకోవలసి ఉంటుంది.వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బేబీ సిట్( Baby Sit ) చేయాల్సి ఉంటుంది.
వారాంతాల్లో కూడా గదిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది, ఎందుకంటే ఆ జంట పిల్లలను చూసుకోవాలని మాత్రమే కోరుకున్నారు.ఈ యూకే కపుల్( UK Couple ) షేర్ చేసిన ప్రకటనలో “హాయ్, మాది ఇటాలియన్ కుటుంబం.
మేం స్టూడెంట్ లేదా ఔ పెయిర్ కోసం వెతుకుతున్నాం.సోమవారం నుంచి శుక్రవారం వరకు మాతో ఉండగలిగే వారిని మేం ఇష్టపడతాం.
అయితే వారం మొత్తం ఉండగలిగే వారిని మేం అంగీకరించవచ్చు.

మధ్యాహ్నం 3-6 గంటల నుంచి రోజుకు 3 గంటల పాటు బేబీ సిట్టింగ్లో మాకు సహాయం చేయగల వ్యక్తి కావాలి.మా పిల్లలు 1, 3 ఏళ్లు.వారు చాలా మంచివారు, కానీ వారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది.మీకు ఒక చిన్న గది, మీ స్వంత బాత్రూమ్ ఉంటుంది.” అని రాశారు.చాలా మంది యాడ్ చూసి లైక్ చేయలేదు.వారు ఈ జంటను ఎగతాళి చేశారు, ఇది చాలా అన్యాయమని పిల్లలను చూసుకునే పనికి వారు విలువ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.“అద్దె చెల్లించమని, వారి కోసం పని చేయమని ఎవరినీ అడగకూడదు.అది సరికాదు.” అని ఒకరు చాలా కోపం వ్యక్తం చేశారు.







