ఆవ నూనెలో ఈ ఆకును మరిగించి తలకు రాస్తే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు

సాధార‌ణంగా ఒక్కో సమయంలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది.రోజు ఊడిపోయే జుట్టును( Hair Fall ) చూసుకుంటూ కొందరు మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

 If You Apply This Oil On Your Head You Can Say Goodbye To Hair Fall Details, Ha-TeluguStop.com

అయితే ఒత్తిడి పెరిగే కొద్ది జుట్టు మరింత అధికంగా ఊడిపోతుంది.కాబట్టి ముందు ఒత్తిడిని వదిలించుకోండి.

ఇకపోతే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో పవర్ ఫుల్ గా పని చేస్తాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకునేవారు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే ఆయిల్ ను తప్పకుండా వాడేందుకు ప్రయత్నించండి.

ఎందుకంటే మీ సమస్యకు ఈ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.

Telugu Bay Leaf, Care, Care Tips, Fall, Oil, Healthy, Kalonji Seeds, Mud Oil, Ha

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఆవ నూనె( Mustard Oil ) పోసుకోవాలి.ఆవ నూనె జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.ఆవ నూనెలో మన జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఆవనూనె వేశాక అందులో ఐదు నుంచి ఆరు బిర్యానీ ఆకులను( Bay Leaf ) తుంచి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Bay Leaf, Care, Care Tips, Fall, Oil, Healthy, Kalonji Seeds, Mud Oil, Ha

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు.ఈ ఆయిల్ మీ జుట్టును మూలాల నుంచి బలంగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని మరియు విరగడాన్ని అడ్డుకుంటుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యకు చాలా వేగంగా చెక్ పెడుతుంది.

మీ హెయిర్ ను డబుల్ చేయడంలో సైతం ఈ ఆయిల్ హెల్ప్ చేస్తుంది.ఇక బిర్యానీ ఆకు మరియు కలోంజీ సీడ్స్ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు మద్దతు ఇస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube