ఐపీఎల్‌కు రిషబ్ పంత్ కోలుకోక‌పోతే... ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వీరు ఎంపిక‌వుతారా?

భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాల‌య్యాడు.రూర్కీ సమీపంలో రిష‌బ్ పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి.

 If Rishabh Pant Does Not Recover For Ipl Will He Be Selected As The Captain Of D-TeluguStop.com

రిష‌బ్ పంత్‌ను వెంటనే డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి త‌ర‌లించారు.అయితే ప్ర‌స్తుతం పంత్ పరిస్థితి కొంత‌మేర‌కు ప్ర‌మాద‌క‌రంగానే ఉందని చెబుతున్నారు.

రిష‌బ్ పంత్ తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.అతని వీపుపై గాయం గుర్తులు క‌నిపిస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితిలో రిష‌బ్‌పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడం ఇప్పట్లో సాధ్యం కాదని చాలామంది అంటున్నారు.వైద్యుల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం రిష‌బ్ పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి మూడు నుండి నాలుగు నెలలు పట్టవచ్చ‌ని తెలుస్తోంది.

రిషబ్ పంత్‌కి సంబంధించిన ఇటువంటి వార్త ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా ఇబ్బందికరంగా మారింది.పంత్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అదే సమయంలో రాబోయే 2023 క్రికెట్‌ సీజన్ కోసం జట్టు క‌స‌ర‌త్తు సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి.అటువంటి ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రిష‌బ్‌ పంత్ సకాలంలో కోలుకోలేకపోతే, ఫ్రాంచైజీ అతనికి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవ‌ల‌సి ఉంటుంది.

జట్టులో కెప్టెన్సీ అనుభవం అధికంగా క‌లిగిన‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిష‌బ్‌ పంత్ నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Delhi, David, Ipl, Prithvi Shaw, Rishabh Pant-Sports News క్రీడ

ఈ ప‌రిస్థితుల్లో రిష‌బ్ పంత్‌ వీలైనంత త్వరగా కోలుకుని ఐపిఎల్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది.అటువంటి పరిస్థితుల‌లో పంత్ సరైన సమయానికి కోలుకోకపోతే అతని స్థానంలో ఎవరు కెప్టెన్సీని చేప‌ట్ట‌గ‌ల‌ర‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్‌కు తిరిగి జట్టులోకి తిరిగి రాలేకపోతే, అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ అప్పగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వార్నర్‌కు అంతర్జాతీయ, ఐపీఎల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.ఐపీఎల్‌లో వార్నర్ చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.ఐపీఎల్‌లో మొత్తం 69 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘన‌త‌ డేవిడ్ వార్నర్‌కు ఉంది.

Telugu Delhi, David, Ipl, Prithvi Shaw, Rishabh Pant-Sports News క్రీడ

ఈ సమయంలో అతను 35 మ్యాచ్‌లు గెలవగా, 32 మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూశాడు.రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి.వార్నర్ కెప్టెన్సీలో జట్టు విజ‌య‌ శాతం కూడా 52.17గా ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా ఎన్నిక చేయకపోతే పృథ్వీ షా ఎంపిక అయ్యే అవ‌కాశాలున్నాయి.

పృథ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభం నుండి దానిలో భాగస్వామ్యం వ‌హిస్తున్నాడు.అదే సమయంలో అండర్-19, ముంబై దేశవాళీ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా అత‌నికి ఉంది.

పృథ్వీ కెప్టెన్సీలో భారత్‌ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube