ఆస్ట్రేలియాని ఆ ర్యాంకింగ్స్‌లో ఓడించిన టీమిండియా.. ఆ వివరాలు ఇవే..

ఫార్మాట్ ఏదైనా సరే క్రికెట్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో టీమిండియా అన్నింటా నంబర్ వన్ ప్లేస్ లోకి చేరుకుంటుంది.కాగా జనవరి 17న ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది.మొన్నటిదాకా ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది కాగా ఆ దేశాన్ని ఇండియా వెనక్కునెట్టి టాప్ ప్లేస్ కి ఎగబాకింది.2022లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించింది.

 Icc Test Rankings India In First Place Beating Australia Details, Team India, Ic-TeluguStop.com

ఆ విజయాలతో 115 రేటింగ్‌ పాయింట్లను సాధించి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్.1 ప్లేస్ కైవసం చేసుకుంది.2022లో టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా కూడా చాలా విజయాలను సాధించింది.అయితే సౌతాఫ్రికా సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేయలేకపోయింది.

మరోవైపు ఇండియా బంగ్లాదేశ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి ఆస్ట్రేలియా కంటే అధిక పాయింట్లు సంపాదించింది.

ప్రస్తుతం ఆసీస్‌ 111 రేటింగ్‌ పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.ఇంగ్లాండ్ 106 పాయింట్లతో థర్డ్ ప్లేస్‌లో, న్యూజిలాండ్‌ 100 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్‌లో, సౌతాఫ్రికా 85 పాయింట్లతో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాయి.ఇదిలా ఉండగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనున్నాయి.

ఈ సిరీస్ తరువాత ర్యాంకింగ్స్‌లో మార్పులు రావచ్చు.ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌ను పోగొట్టుకోకుండా ఉండాలంటే, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును దక్కించుకోవాలంటే ఇండియా ఆసీస్‌తో జరిగే సిరీస్‌ను గెలుచుకోవాల్సి ఉంటుంది.మరి టీమ్ ఇండియా ఎంత బాగా ఆడుతుందో చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube