నాకు ఐపీఎల్ వేలంలో రూ.15 కోట్లు వచ్చి ఉండేవి: మాజీ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బీసీసీఐ 2007లో ఐపీఎల్ ని ఇంట్రడ్యూస్ చేసింది.2008లో ఫస్ట్ సీజన్ జరిగింది.అలా ఇప్పటివరకు 14 సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం 15వ సీజన్ జరుగుతోంది.ఈ సీజన్ లో ఒక్కొక్క ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.

 I Would Easily Bought To 15 Crores In Ipl Auctions Says Ravi Sastri Details, 15-TeluguStop.com

అయితే ఈసారి బ్యాటర్ ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు.రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ ని ముంబై ఇండియన్స్ జట్టు రూ.15.25 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ ప్లేయర్ వయసు కేవలం 23 ఏళ్లే కానీ అతడి అదరగొట్టే బ్యాటింగ్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.

అందుకే ముంబై ఇండియన్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చి అతన్ని కొనుగోలు చేసింది.

అయితే క్రికెట్ లో చాలామంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు.

వాళ్లంతా క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాతనే ఐపీఎల్ స్టార్ట్ అయింది.ఒకవేళ అలాంటి దిగ్గజ ప్లేయర్లు ఇప్పుడు ఉన్నట్టయితే ఐపీఎల్ లో ఎంత ధర పలికే వారు? అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు.కానీ రవిశాస్త్రి మాత్రం తనకు ఎంత ధర పలుకుతుందో నిస్సంకోచంగా చెప్పేశారు.మాజీ ఆల్‌రౌండర్‌ రవిశాస్త్రి కాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి లెక్క ప్రకారం, ఐపీఎల్ లో తనకు రూ.15 కోట్ల వచ్చి ఉండేవని అన్నారు.అంతేకాదు, తానొక టీమ్ కు కెప్టెన్‌ బాధ్యతలు కూడా సొంతం చేసుకొని ఉండేవాడినని అన్నారు.

”ఐపీఎల్ లో నేను కచ్చితంగా రూ.15 కోట్ల ధర పలికి ఉండేవాడిని.ఒక జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ ఉండేవాడిని.

ఇది కేవలం నా ఆలోచన మాత్రమే కాదు.ఈ ప్రశ్న ఎవరినడిగినా దాదాపు ఇలాంటి సమాధానమే ఇస్తారు” అని చెప్పుకొచ్చారు.

అయితే రవి శాస్త్రి రికార్డు ట్రాక్ చూస్తే అతను ఒక గొప్ప క్రికెటర్ అనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు.రవిశాస్త్రి తన క్రికెట్ కెరీర్ లో 80 టెస్టుల్లో 3,830 పరుగులు సాధించారు.

ఇంకా వన్డే ఫార్మాట్ లో కూడా ఆయన మెరుగ్గా రాణించారు.రవి శాస్త్రి ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టి తన సత్తా చాటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube