'రాధే శ్యామ్' నుంచి 'నగుమోము తారలే' రొమాంటిక్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా.? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి.

 Huge Response For Radhe Shyam Nagumomu Thaarale Romantic Song Details, Huge Resp-TeluguStop.com

ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ హిందీ సాంగ్ కు మంచి అప్లాజ్ వచ్చింది.తాజాగా తెలుగు సాంగ్ విడుదలయింది.నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది.

ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రోమాంటిక్‌గా కనిపిస్తున్నారు.సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు.యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు.సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు.జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు.

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్, నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌, బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్, సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్, సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి, ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube