అమెరికా అధ్యక్ష పీటం పోరు రసకందాయంలో పడింది.ఈ సారి అద్యక్ష ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరిని వరిస్తాయోనని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.
అయితే కొన్ని సర్వేల ప్రకారం చూస్తే ఈ సారి డెమోక్రటిక్ పార్టీ కి అమెరికా అధ్యక్ష పీటం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆ పార్టీకి బలమైన అభ్యర్ధిగా నిలిచినా బెర్నీ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న సెనేటర్ బెర్నీ సాండర్స్ కి నాల్గవ త్రైమాసికం లో సుమారు 3.45 కోట్ల పైగా భారీగా విరాళాలు అందాయి.ఈ మొత్తాన్ని 18 లక్షల మంది ఇచ్చినట్టుగా తెలుస్తోంది.అంటే ఒక్కొక్కరు సుమారు 18.53 డాలర్లు ఇచ్చినట్టుగా బెర్నీ పర్సనల్ సెక్రటరీ తెలిపారు.కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 1.80 లక్షల డాలర్ల విరాళాలు అందినట్టు అంచనా.
ఇదిలాంటే బెర్నీ తో పాటు అధ్యక్ష పీటం కోసం పోటీ పడుతున్న మరో కొంతమంది డెమోక్రటిక్ పార్టీ నేతలకి సైతం నాల్గవ త్రైమాసికంలో తమకి అందిన విరాళాల వివరాలు తెలిపారు.వీరిలో పీట్ బుటీగీగ్ కి 2.47 కోట్ల డాలర్లు.అలాగే వారెన్ కి 1.7 కోట్ల డాలర్లు అందాయి.ఇక రిపబ్లికన్ పార్టీ నుంచీ పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్ధి ట్రంప్ కి 4.6 కోట్ల డాలర్లు విరాళాలు అందినట్టుగా తెలుస్తోంది.